Kalki 2898 AD : అద్భుతమైన కల ‘కల్కి’

ABN , Publish Date - Jun 11 , 2024 | 05:11 AM

అందరూ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘కల్కి 2898 ఏ.డీ’. ప్రభాస్‌ నటించిన ఈ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌కు నాగ్‌అశ్విన్‌ దర్శకత్వం వహించగా, అశ్వనీదత్‌ నిర్మించారు.

Kalki 2898 AD : అద్భుతమైన కల ‘కల్కి’

అందరూ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘కల్కి 2898 ఏ.డీ’. ప్రభాస్‌ నటించిన ఈ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌కు నాగ్‌అశ్విన్‌ దర్శకత్వం వహించగా, అశ్వనీదత్‌ నిర్మించారు. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, రాజేంద్రప్రసాద్‌, పశుపతి, దీపికా పదుకొనే, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 27న సినిమాను ఐదు భారతీయ భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మరిన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. అత్యద్భుత సాంకేతిక విలువలతో విజువల్‌ వండర్‌లా ఉన్న ఈ ట్రైలర్‌లోని వీఎ్‌ఫఎక్స్‌ షాట్స్‌, డైలాగ్స్‌, నటీనటుల పర్ఫామెన్స్‌, నేపధ్య సంగీతం మరో స్థాయిలో ఉన్నాయి. ట్రైలర్‌ విడుదల చేసిన అనంతరం దర్శకుడు నాగ్‌అశ్విన్‌ మాట్లాడుతూ ‘‘ఒక దర్శకుడిగా నాకు ఇండియన్‌ మైథాలజీ, సైన్స్‌ ఫిక్షన్‌ అంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో ఆ రెండింటినీ మిక్స్‌ చేశాను. ఈ ప్రయోగం థియేటర్లలో సినిమాను చూసే ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఈ సినిమా ఒక అద్భుతమైన కలలాంటిది. ఆ కలను తెరపైకి తెచ్చేందుకు చాలా సమయం పట్టింది. ఈ ప్రయాణంలో చిత్ర బృందం పడిన శ్రమ అంతా ఇంతా కాదు. టీమ్‌ అంతా ప్రాణం పెట్టి పనిచేయడంతోనే ఈ సినిమా అవుట్‌పుట్‌ అనుకున్న దానికంటే పది రెట్లు బాగా వచ్చింది’’ అని అన్నారు.

Updated Date - Jun 11 , 2024 | 05:11 AM