క్లీంకారకు కల్కి టీమ్‌ గిఫ్ట్స్‌

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:33 AM

విడుదల తేదీ దగ్గర పడడంతో ‘కల్కి 2898 ఏ.డీ’ చిత్ర బృందం ప్రచారం జోరు పెంచింది. ప్రమోషన్స్‌లో భాగంగా స్టార్‌ కిడ్స్‌కు గిఫ్ట్స్‌ను పంపిస్తోంది. ఇటీవలే ఈ గిఫ్ట్స్‌...

క్లీంకారకు కల్కి టీమ్‌ గిఫ్ట్స్‌

విడుదల తేదీ దగ్గర పడడంతో ‘కల్కి 2898 ఏ.డీ’ చిత్ర బృందం ప్రచారం జోరు పెంచింది. ప్రమోషన్స్‌లో భాగంగా స్టార్‌ కిడ్స్‌కు గిఫ్ట్స్‌ను పంపిస్తోంది. ఇటీవలే ఈ గిఫ్ట్స్‌ రామ్‌చరణ్‌, ఉపాసనల కూతురు క్లీంకారకు చేరాయి. ఆ బహుమతుల్లో బుజ్జి-భైరవ స్టికర్స్‌, బుజ్జి క్యారెక్టర్‌ బొమ్మ, టీషర్ట్‌లు ఉన్నాయి. ఆ గిఫ్ట్స్‌తో ఆడుకుంటున్న క్లీంకార ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఉపాసన.. కల్కి టీమ్‌కు కృతజ్ఞతలతో పాటూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ఈ ప్రచారంలో భాగంగా త్వరలోనే మరింత మంది సెలబ్రిటీల పిల్లలకూ ఈ గిఫ్ట్స్‌ అందుతాయట.


కాగా, అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్‌ ఇండియా మూవీ ‘కల్కి 2898 ఏ.డీ’ ఈ నెల 27న విడుదల కానుంది. ప్రభాస్‌ హీరోగా నటించిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌కు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించారు. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనే, దిశా పటానీలతో కూడిన భారీ తారాగణం ఇందులో నటించారు. వైజయంతీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై అశ్వనీదత్‌ నిర్మించిన ఈ చిత్రం మహా భారతంతో మొదలై క్రీస్తు శకం 2898లో పూర్తయ్యేలా, మొత్తం ఆరు వేల ఏళ్ల సంవత్సరాల వ్యవధిలో జరిగే కథగా తెరకెక్కింది.

Updated Date - Jun 04 , 2024 | 12:33 AM