Kalki 2898 AD: సాధారణంగా కనిపించే వ్యక్తులు అద్భుతాలు సృష్టిస్తారు

ABN , Publish Date - Jun 20 , 2024 | 02:16 PM

అమితాబ్‌ బచ్చన్‌ను మొదటిసారి సెట్‌లో చూసినప్పుడు ఆయన పాదాలు తాకి ఆశీస్సులు తీసుకోవాలనిపించిందని 'కల్కి’ చిత్రం షూటింగ్‌ మొదలైన సమయంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు ప్రభాస్‌.

Kalki 2898 AD: సాధారణంగా కనిపించే వ్యక్తులు  అద్భుతాలు సృష్టిస్తారు

అమితాబ్‌ బచ్చన్‌ను (Amitabh Bachchan) మొదటిసారి సెట్‌లో చూసినప్పుడు ఆయన పాదాలు తాకి ఆశీస్సులు తీసుకోవాలనిపించిందని 'కల్కి’(Kalki 2898 AD)  చిత్రం షూటింగ్‌ మొదలైన సమయంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు ప్రభాస్‌ (Prabhas). బిగ్‌బీ పాదాలు తాగే ప్రయత్నం చేయగా అలా చేయొద్దన్నారని, ‘నువ్వు ఆపకపోతే నేనూ నీ పాదాలు తాకుతా’ అన్నారని తాజాగా జరిగిన ఈవెంట్‌లో ప్రభాస్‌ గుర్తు చేసుకున్నారు. నాగ్‌ అశ్విన్  దర్శకత్వంలో ప్రభాస్‌కు జోడీగా దీపికా పడుకోన్  నటించిన ఈ చిత్రంలో అమితాబ్‌, కమల్‌ హాసన్‌, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్‌, శోభన కీలక పాత్రధారులు. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ముంబైలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన వేడుకకు హీరో రానా హోస్ట్‌గా వ్యవహరించారు. ఆయన అడిగిన ప్రశ్నలకు ‘కల్కి’ టీమ్‌  ఆసక్తికర సమాధానాలిచ్చారు.

అది నా డ్రీం: ప్రభాస్   
అమితాబ్‌, కమల్‌ హాసన్ లాంటి లెజెండ్స్‌తో కలిసి నటించే అవకాశం ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌, అశ్వనీదత్‌కు థ్యాంక్స్‌. వీరితో తెర పంచుకోవాలనేది నా డ్రీమ్‌. అమితాబ్‌ సర్‌ సెట్స్‌లోకి రాగానే ఆయన పాదాల్ని తాకబోతుంటే.. ‘దయచేసి ఇలా చేయకు. నువ్వు నా పాదాలు తాకితే నేనూ నీ పాదాలు తాకుతా’’ అని అన్నారు. అప్పట్లోనే దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు ఆయన. పొడుగు వారందరినీ ఆయనతో పోల్చేవారు (నవ్వుతూ). కమల్‌ సర్‌ ‘సాగర సంగమం’ సినిమా చూసి, అందులో ఆయన ధరించిన దుస్తులు కావాలని అమ్మను అడిగా. ‘ఇంద్రుడు చంద్రుడు’లోని ఆయన నటనకు ఫిదా అయ్యా.  దీపికా సూపర్‌స్టార్‌. అద్భుతమైన నటి’’ అని ప్రభాస్‌ చెప్పారు.

IMG-20240619-WA0060.jpg

"లాక్‌డౌన్‌లో నేనీ కథ విన్నా. ‘జూమ్‌’ ద్వారా నాగీ ఈ  స్క్రిప్ట్  వినిపించారు. ఆయన చెప్పిన విధానం నన్ను బాగా ఆకట్టుకుంది. తక్కువ సమయంలోనే ఆయన ప్రతిభ గురించి అర్థమైంది. నేను ఈ చిత్రంలో తల్లిగా నటించా’’ అని దీపికా పదుకోనె అన్నారు.

కథ విన్నప్పుడు మీరెలా స్పందించారు.


అమితాబ్‌ బచ్చన్‌: నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమా ఐడియా చెప్పగానే అద్భుతమనిపించింది. ఇలాంటి ఆలోచనల కోసం ఆయనేం తాగుతున్నాడో అని అనుకున్నా. విజన్‌ ఉన్న దర్శకుడు. పేపర్‌పై ఏం రాసుకున్నాడో దాన్ని అదే స్థాయిలో తెరపైకి తీసుకొచ్చేందుకు చాలా శ్రమించాడు. ఈ షూటింగ్‌ జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేను.
ఇతిహాసంతో కూడిన సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రమిది. దర్శకుడిగా పెద్ద అనుభవం లేదు. ఏ నమ్మకంతో అంగీకరించారు.


కమల్‌ హాసన్‌(Kamal Haasan): బయట మనం చూస్తుంటం. సాధారణంగా  కనిపించే వ్యక్తులు అసాధారణ పనులు చేస్తుంటారు. నాగ్‌ అశ్విన్‌తో కాసేపు మాట్లాడగానే తన టాలెంట్‌ అర్థమైంది. నేను ఈ మూవీలో బ్యాడ్‌మ్యాన్‌గా కనిపిస్తా ఇందులో నా లుక్‌ భిన్నంగా ఉంటుంది. అలా ఉండాలని ముందే నిర్ణయించుకున్నాం. ఆ సమయానికి ఈ చిత్రానికి సంబంధించిన ఏ విజువల్స్‌నూ నేను చూడలేదు. కొత్త గెటప్‌ కోసం కొంత రీసెర్చ్‌ చేసి వస్తే.. లుక్‌లోనే అమితాబ్‌ నటిస్తున్నారని తెలిసింది. మరో గెటప్‌తో వస్తే ప్రభాస్‌ ఇలానే కనిపించనున్నారని సమాధానమిచ్చారు. ఫైనల్‌గా నాకంటూ ఓ లుక్‌ సెట్‌ అయింది. దానిని ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారోనన్న భయం నాక్కూడా ఉంది. Deepika.jpg

Updated Date - Jun 20 , 2024 | 03:19 PM