కల్కి ప్రత్యేక షో, టికెట్‌ ధరల పెంపునకు అనుమతి

ABN , Publish Date - Jun 23 , 2024 | 06:41 AM

ప్రభాస్‌ హీరోగా నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏ.డీ’ చిత్రం ప్రత్యేక ప్రదర్శన, టికెట్‌ ధరల పెంపునకు అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం...

కల్కి ప్రత్యేక షో, టికెట్‌ ధరల పెంపునకు అనుమతి

ప్రభాస్‌ హీరోగా నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏ.డీ’ చిత్రం ప్రత్యేక ప్రదర్శన, టికెట్‌ ధరల పెంపునకు అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 27వ తేదీన చిత్రం విడుదల కానుంది. జూలై 4వ తేదీ దాకా 8 రోజుల పాటు ప్రతీరోజూ ఐదు షోలు ప్రదర్శించటానికి అవకాశం ఇచ్చారు. విడుదల రోజు ఉదయం 5:30 గంటలకు ప్రత్యేక ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆ రోజు మొత్తం ఆరు షోలు ప్రదర్శించనున్నారు. ఇక టికెట్‌ ధరను జీఎస్టీతో కలిపి రూ.200లకు పెంచుకోవడానికి అనుమతించారు. సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్‌లలో ప్రస్తుతం ఉన్న టికెట్‌ ధరపై రూ.75, మల్టీప్లెక్స్‌లలో రూ.100 అదనంగా పెంచుకోవడానికి అనుమతిస్తూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్‌ జితేందర్‌ శనివారం మెమోనెం.23424/జనరల్‌.ఏ1/2024ను జారీ చేశారు.

- ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌

Updated Date - Jun 23 , 2024 | 06:41 AM