మరో రికార్డును సాధించిన కల్కి

ABN, Publish Date - Jul 19 , 2024 | 02:10 AM

విడుదలైన మొదటి రోజు నుంచే హిట్‌ టాక్‌ తెచ్చుకుని వరుస రికార్డులు సృష్టిస్తోంది ‘కల్కి 2898 ఏ.డీ’ సినిమా. ఇటీవలే రూ.1000 కోట్లు సాధించిన ఏడవ ఇండియన్‌ సినిమాగా.. రెండవ ప్రభాస్‌ సినిమాగా నిలిచింది. ఈ రికార్డుల వేటలో...

విడుదలైన మొదటి రోజు నుంచే హిట్‌ టాక్‌ తెచ్చుకుని వరుస రికార్డులు సృష్టిస్తోంది ‘కల్కి 2898 ఏ.డీ’ సినిమా. ఇటీవలే రూ.1000 కోట్లు సాధించిన ఏడవ ఇండియన్‌ సినిమాగా.. రెండవ ప్రభాస్‌ సినిమాగా నిలిచింది. ఈ రికార్డుల వేటలో భాగంగా ఈ సినిమా మరో అరుదైన ఘనతను సాధించింది. టికెట్‌ బుక్కింగ్స్‌ అప్లికేషన్‌ ‘బుక్‌ మై షో’లో అత్యధిక టికెట్స్‌ బుక్‌ అయిన సినిమాగా ఖ్యాతి గడించింది. 12.15 మిలియన్స్‌ (దాదాపు రూ.1 కోటి 25 లక్షలు) టికెట్స్‌ బుక్‌ అయిన ఈ సినిమా అంతకుమందు ‘జవాన్‌’ సినిమా పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది. ‘జవాన్‌’ 12.01 (దాదాపు రూ.1 కోటి 20 లక్షలు) మిలియన్స్‌ టికెట్‌ బుకింగ్స్‌తో ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. కాగా, నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్‌ ఇండియన్‌ సైన్స్‌ ఫిక్షన్‌ ఫిల్మ్‌లో


ప్రభాస్‌ ‘భైరవ’ పాత్రలో.. అమితాబ్‌ బచ్చన్‌ పురాణ యోధుడు ‘అశ్వత్థామ’గా..కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనే, రాజేంద్ర ప్రసాద్‌ కీలక పాత్రల్లో అలరించారు. ఈ సినిమాకు కొనసాగింపుగా పార్ట్‌-2 తెరకెక్కనుందని చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Updated Date - Jul 19 , 2024 | 02:10 AM