Kalki 2898 AD: ‘కల్కి 2898 AD’ ట్రైలర్‌ రిలీజ్‌కు డేట్ ఫిక్సయింది..

ABN , Publish Date - Jun 05 , 2024 | 05:17 PM

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు ‘కల్కి 2898 AD’ టీమ్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా ట్రైలర్ విడుదలకు సంబంధించిన అప్డేట్‌తో ఫ్యాన్స్‌ని ఖుషి చేసింది. ది వెయిట్ ఈజ్ ఫైనల్లీ ఓవర్.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ దిగ్గజాలు నటించిన సైన్స్ ఫిక్షన్ మాగ్నమ్ ఓపస్ ‘కల్కి 2898 AD’ ట్రైలర్ రిలీజ్‌కు డేట్ లాకయింది.

Kalki 2898 AD: ‘కల్కి 2898 AD’ ట్రైలర్‌ రిలీజ్‌కు డేట్ ఫిక్సయింది..
Prabhas in Kalki 2898 AD Movie

రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) ఫ్యాన్స్‌కు ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) టీమ్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా ట్రైలర్ విడుదలకు సంబంధించిన అప్డేట్‌తో ఫ్యాన్స్‌ని ఖుషి చేసింది. ది వెయిట్ ఈజ్ ఫైనల్లీ ఓవర్.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ దిగ్గజాలు నటించిన సైన్స్ ఫిక్షన్ మాగ్నమ్ ఓపస్ ‘కల్కి 2898 AD’ ట్రైలర్ 10 జూన్ 2024న రిలీజ్ కాబోతున్నట్లుగా మేకర్ష్ అధికారికంగా ప్రకటించారు. అమెజాన్ ప్రైమ్‌లో బి అండ్ బి, బుజ్జి అండ్ భైరవ ప్రిల్యూడ్ విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఈ ఫ్యూచరిస్టిక్ ఎక్సట్రావగంజా ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుధవారం ఉదయం ట్రైలర్ లాంచ్‌ సంబంధించిన డేట్‌ని అనౌన్స్ చేస్తూ, సినిమా అఫీషియల్ హ్యాండిల్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. (Kalki 2898 AD Trailer Release Date)

Also Read- Jr NTR: ఏపీ ఎన్నికల ఫలితాలపై రియాక్టైన తారక్.. ఏమన్నారంటే?


“ఏ న్యూ వరల్డ్ అవైట్స్ #Kalki2898AD Trailer on June 10th” అంటూ మేకర్స్ వదిలిన పోస్టర్‌లో ప్రభాస్ భైరవ అవతార్‌లో కనిపిస్తున్నారు. ప్రభాస్ పర్వత శిఖరంపై నిలబడి ఆకాశం వైపు చూస్తూ కనిపించిన ఈ పోస్టర్‌తో పాటు.. పోస్టర్‌పై రాసిన “Everything is about to change” క్యాప్షన్ మరింత క్యురియాసిటీని పెంచుతోంది. ఆ క్యూరియాసిటీ పోవాలంటే జూన్ 10 రావాల్సిందే.


Prabhas.jpg

విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో విజువల్ వండర్‌గా తెరకెక్కుతోన్న ‘కల్కి 2898 AD’లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ నటిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇందులో కమల్ హాసన్ (Kamal Haasan) విలన్ పాత్రలో నటించడం గమనార్హం. ఈ మూవీ అద్భుతమైన కథాంశం, హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఇండియన్, ఇంటర్ నేషనల్ మార్కెట్లలో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేస్తోంది. వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం 2024 జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.

Read Latest Cinema News

Updated Date - Jun 05 , 2024 | 05:33 PM