కొత్త కాన్సెప్ట్‌తో కళింగ

ABN , Publish Date - Sep 12 , 2024 | 03:43 AM

ధ్రువ వాయు హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘కళింగ’ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్‌ ఈ సినిమాను నిర్మించారు...

ధ్రువ వాయు హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘కళింగ’ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్‌ ఈ సినిమాను నిర్మించారు. మంగళవారం నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు బీజేపీ నేత రఘనందన్‌ ముఖ్య అతిదిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ధ్రువ వాయు మాట్లాడుతూ ‘మా సినిమా టీజర్‌, ట్రైలర్‌ చూసి ఇది ‘కాంతారా, విరూపాక్ష, మంగళవారం’ చిత్రాల తరహాలో ఉంటుందా అని అడుగుతున్నారు. ఇదొక కొత్త కాన్సె్‌ప్టతో తీసిన సినిమా. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది’ అన్నారుఽ. ధ్రువ వాయు డెడికేషన్‌, ఫ్యాషన్‌ వల్లే ఈ రోజు ఇక్కడ ఉన్నామని నిర్మాత దీప్తి చెప్పారు. సినిమా బాగా వచ్చిందని మరో నిర్మాత పృథ్వీ యాదవ్‌ చెప్పారు.

Updated Date - Sep 12 , 2024 | 03:43 AM