కొత్త కాన్సె్‌ప్టతో కళింగ
ABN , Publish Date - Aug 28 , 2024 | 02:30 AM
ధ్రువ వాయు హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘కళింగ’. ప్రజ్ఞా నయన్ హీరోయిన్. సెప్టెంబర్ 13న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా...
ధ్రువ వాయు హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘కళింగ’. ప్రజ్ఞా నయన్ హీరోయిన్. సెప్టెంబర్ 13న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ధ్రువ వాయు మాట్లాడుతూ ‘తెలుగులో ఇంతవరకూ రాని కాన్సె్‌ప్టతో ‘కళింగ’ రూపుదిద్దుకుంది. ఇది రెగ్యులర్ మూవీ కాదు’ అన్నారు. ఈ సినిమాను చాలా వరకూ అవుట్‌డోర్‌లో, ఫారె్‌స్టలో తీశామనీ, సినిమా అద్భుతంగా వచ్చిందని నిర్మాతలు పృథ్వీ యాదవ్, దీప్తి కొండవీటి చెప్పారు.