సికందర్‌ సెట్స్‌లోకి కాజల్‌?

ABN , Publish Date - Sep 12 , 2024 | 03:49 AM

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌, తమిళ డైరెక్టర్‌ ఏ.ఆర్‌.మురుగుదాస్‌ కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సికందర్‌’. సత్యరాజ్‌, ప్రతీక్‌ బబ్బర్‌ కీలక పాత్రలు పోషిస్తుండగా.

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌, తమిళ డైరెక్టర్‌ ఏ.ఆర్‌.మురుగుదాస్‌ కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సికందర్‌’. సత్యరాజ్‌, ప్రతీక్‌ బబ్బర్‌ కీలక పాత్రలు పోషిస్తుండగా.. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్‌ జరుగుతోంది. అయితే, ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో నటించడానికి కాజల్‌ అగర్వాల్‌ సెట్స్‌లోకి అడుగుపెట్టినట్లు టాక్‌. ఈ చిత్రాన్ని ఈద్‌ కానుకగా 2025లో విడుదల చేయనున్నారు. కాగా, బాలీవుడ్‌లో కాజల్‌ ఇంతకుముందు అజయ్‌ దేవ్‌గణ్‌ నటించిన ‘సింగమ్‌’, అక్షయ్‌కుమార్‌ నటించిన ‘స్పెషల్‌ 26’ చిత్రాల్లో నటించారు.

Updated Date - Sep 12 , 2024 | 03:49 AM