Kannappa : కన్నప్ప కోసం కాజల్‌

ABN , Publish Date - May 18 , 2024 | 05:57 AM

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ లో నటించే స్టార్స్‌ సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మొన్న బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌, నిన్న ప్రభాస్‌, తాజాగా

Kannappa : కన్నప్ప కోసం కాజల్‌

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ లో నటించే స్టార్స్‌ సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మొన్న బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌, నిన్న ప్రభాస్‌, తాజాగా ఇప్పుడు కాజల్‌. ఇలా రోజుకో స్టార్‌ ఎంట్రీతో, అప్టేడ్స్‌తో ‘కన్నప్ప’ చిత్రం నేషనల్‌ వైడ్‌గా ట్రెండ్‌ అవుతోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కాజల్‌ నటిస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకుముందు ‘మోసగాళ్లు’ చిత్రంలో విష్ణు, కాజల్‌ నటించిన సంగతి విదితమే. ఇప్పుడు మరోసారి విష్ణు సినిమాలో కాజల్‌ నటిస్తున్నారు. డాక్టర్‌ మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకుడు. న్యూజిలాండ్‌లో ‘కన్నప్ప’ చిత్రానికి సంబంధించిన రెండు మేజర్‌ షెడ్యూల్స్‌ జరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతోంది. ఈ నెల 20న కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప’ టీజర్‌ విడుదల చేయనున్నారు.

Updated Date - May 18 , 2024 | 05:57 AM