డూప్‌ లేకుండా కాజల్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ చేశారు

ABN , Publish Date - Jun 02 , 2024 | 02:17 AM

‘ఎమోషన్‌, యాక్షన్‌ అంశాలతో ‘సత్యభామ’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. యాక్షన్‌ పార్ట్‌ కోసం కాజల్‌ అగర్వాల్‌ ఎంతో కష్టపడ్డారు. చాలా ధైర్యంగా స్టంట్స్‌ చేశారు...

డూప్‌ లేకుండా కాజల్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ చేశారు

‘ఎమోషన్‌, యాక్షన్‌ అంశాలతో ‘సత్యభామ’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. యాక్షన్‌ పార్ట్‌ కోసం కాజల్‌ అగర్వాల్‌ ఎంతో కష్టపడ్డారు. చాలా ధైర్యంగా స్టంట్స్‌ చేశారు’ అని దర్శకుడు సుమన్‌ చిక్కాల అన్నారు. కాజల్‌ అగర్వాల్‌ పోలీసాఫీసర్‌గా నటించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సుమన్‌ మీడియాతో మాట్లాడారు.


  • సినిమాలపై ఆసక్తి ఉండడంతో ఉద్యోగం చేస్తూనే చిత్రపరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నించాను. దర్శకుడు శశికిరణ్‌ తీసిన కొన్ని సినిమాలకు పనిచేశాను. ఆయన ఈ సినిమాకు దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చారు. కొంతమంది పోలీసుల జీవితాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా కథ రాసుకున్నాను.

  • అయితే ‘సత్యభామ’ కథ రాయడం పూర్తయ్యాక లీడ్‌రోల్‌లో ఎవరైనా హీరోయిన్‌ చేస్తే బావుంటుంది అనుకున్నాం. కాజల్‌ కథ వినగానే ‘ఎస్‌’ చెప్పారు. డూప్‌ లేకుండా యాక్షన్‌ సీక్వెన్స్‌లు చేశారు. సత్యభామ తన దగ్గరకు వచ్చిన ఒక కేసును పర్సనల్‌గా తీసుకుంటుంది. ఎమోషనల్‌ అవుతుంది. బాధితురాలికి న్యాయం చేసేందుకు ఎలాంటి పోరాటానికికైనా సిద్ధమవుతుంది. పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా కాజల్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. నవీన్‌ చంద్ర కీలకపాత్ర పోషిస్తున్నారు.

Updated Date - Jun 02 , 2024 | 02:17 AM