మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

వీళ్లు ముగ్గురు.. ఎందుకు క‌లిశారంటే..?

ABN , Publish Date - Mar 04 , 2024 | 10:07 AM

తాజాగా సోషల్‌ మీడియాలో ఓ ఫోటో బాగా వైర‌ల్ అవుతోంది. అది జూ.ఎన్టీఆర్, కాంతారా హీరో రిష‌బ్ షెట్టి ఇంకా కేజీఎఫ్‌, స‌లార్ చిత్రాల ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ఫ్యామిలీస్‌తో క‌లిసి దిగిన ఈ ఫొటో రెండు రోజుల నుంచి బాగా ట్రెండ‌వుతోంది.

వీళ్లు ముగ్గురు.. ఎందుకు క‌లిశారంటే..?
jr ntr

తాజాగా సోషల్‌ మీడియాలో ఓ ఫోటో బాగా వైర‌ల్ అవుతోంది. అది జూ.ఎన్టీఆర్ (Jr NTR), కాంతారా హీరో రిష‌బ్ షెట్టి (Rishab Shetty) ఇంకా కేజీఎఫ్‌, స‌లార్ చిత్రాల ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ (Prasanth Neel) ఫ్యామిలీస్‌తో క‌లిసి దిగిన ఈ ఫొటో రెండు రోజుల నుంచి బాగా ట్రెండ‌వుతోంది.

rishab.jpeg

అయితే ఎన్టీఆర్ (Jr NTR) ప్ర‌స్తుతం దేవ‌ర (Devara) సినిమా చేస్తుండ‌గా త‌న త‌దుప‌రి చిత్రం ప్ర‌శాంత్ నీల్‌తో ఉంటుంద‌ని గ‌తంలోనే ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఆ సినిమా క‌థా చ‌ర్చ‌ల కోసం వారు క‌లిశారంటూ నెట్టింట‌ వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే వారంతా బెంగ‌ళూరులో జ‌రిగిన ఓ ప్రైవేట్ ఫంక్ష‌న్‌లో పాల్గొన్నార‌ని అంత‌కు మించి ఏమీ లేద‌ని తెలియ‌వ‌చ్చింది.

jr ntr.jpeg


ఇదిలాఉండ‌గా జూ. ఎన్టీఆర్ (Jr NTR) దేవ‌ర చిత్రం పార్ట్ 1పూర్తి చేశాక బాటీవుడ్ చిత్రం వార్ 2కు డేట్స్ కేటాయించ‌డంతో మ‌రో 6 నెల‌ల పాటు ఆ సినిమా షూటింగ్‌లోనే పాల్గొన‌నున్నాడు.

junior ntr.jpeg

అదేవివిధంగా తాజాగా స‌లార్ (Salaar) వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన‌ ప్ర‌శాంత్‌ నీల్ (Prasanth Neel) ఈ ఏప్రిల్‌లో నే స‌లార్ పార్ట్‌2 (Salaar 2) షూటింగ్ ప్రారంభించ‌నున్నట్లు స‌మాచారం. దీంతో జూ. ఎన్టీఆర్ ,ప్ర‌శాంత్ నీల్ చిత్రం ఈ ఏడాది చివ‌ర‌లో ప్రారంభ‌మ‌వుతుంద‌ని తెలుస్తోంది.

ఇక కాంతార వంటి హిట్ త‌ర్వాత రిష‌బ్ షెట్టి (Rishab Shetty) కాంతారా 2ను పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ షూటింగ్ కాస్త విరామం ఇచ్చారు.

prasanth neel.jpeg

ఈ క్ర‌మంలో వీకెండ్‌లో ప్ర‌శాంత్ నీల్ ఇంట్లో జ‌రిగిన చిన్న పార్టీకి రిష‌బ్ కూడా హ‌జ‌రై ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్, నిర్మాతలు హోంబ‌లే ఫిలింస్‌ విజ‌య్ కిరంగ‌దూర్‌, మైత్రీ మూవీస్ (Mythri Movie Makers) య‌ల‌మంచ‌లి ర‌వి కిశోర్‌ల‌తో క‌లిసి ఇలా ఫొటోల‌కు పోజులిచ్చారు. ఆ ఫోటోలు సామాజిక మాధ్య‌మాల్లోకి వ‌చ్చేయ‌డంతో బాగా వైర‌ల్ అవుతున్నాయి.

Updated Date - Mar 04 , 2024 | 10:07 AM