జర్నీ టూ అయోధ్య

ABN , Publish Date - Apr 18 , 2024 | 06:42 AM

రామాయణం ఆధారంగా టాలీవుడ్‌లో మరో భారీ చిత్రం రూపుదిద్దుకోనుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో, చిత్రాలయం బేనర్‌పై భారీస్థాయిలో నిర్మించేందుకు నిర్మాత వేణు దోనెపూడి సన్నాహాలు...

జర్నీ టూ అయోధ్య

రామాయణం ఆధారంగా టాలీవుడ్‌లో మరో భారీ చిత్రం రూపుదిద్దుకోనుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో, చిత్రాలయం బేనర్‌పై భారీస్థాయిలో నిర్మించేందుకు నిర్మాత వేణు దోనెపూడి సన్నాహాలు మొదలుపెట్టారు. శ్రీరామనవమి సందర్భంగా బుధవారం ఆయన ఈ చిత్రాన్ని ప్రకటించారు. దర్శకుడు వి.ఎన్‌ ఆదిత్య కథను అందిస్తున్నారు. ‘జర్నీ టూ అయోధ్య’ అనేది వర్కింగ్‌ టైటిల్‌. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. అయోధ్యప్రాంతంలో లొకేషన్ల అన్వేషణలో చిత్రబృందం పాల్గొంటోంది. తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్‌, దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్‌లో వస్తున్న ‘విశ్వం’ సినిమాను పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీతో కలసి చిత్రాలయం స్టూడియోస్‌ నిర్మిస్తోంది.

Updated Date - Apr 18 , 2024 | 06:42 AM