జర్నలిస్ట్‌ మాస్‌ నంబర్‌

ABN , Publish Date - Apr 17 , 2024 | 02:58 AM

నారా రోహిత్‌ హీరోగా నటించిన ‘ప్రతినిధి 2’ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ప్రముఖ జర్నలిస్ట్‌ మూర్తి దేవగుప్తపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు...

జర్నలిస్ట్‌ మాస్‌ నంబర్‌

నారా రోహిత్‌ హీరోగా నటించిన ‘ప్రతినిధి 2’ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ప్రముఖ జర్నలిస్ట్‌ మూర్తి దేవగుప్తపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కుమార్‌ రజాబత్తుల, ఆంజనేయులు శ్రీతోట, సురేంద్రనాథ్‌ బొల్లినేని నిర్మాతలు. ఈ సినిమా నుంచి ‘గల్లా యెత్తి’ అనే మాస్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. సమాజంలోని మంచి చెడుల గురించి ఆలోచింపజేసే విధంగా కాసర్ల శ్యామ్‌ ఈ పాట రాశారు. రామ్‌ మిరియాల పాడారు. మహతి స్వరసాగర్‌ సంగీత దర్శకుడు. భాను మాస్టర్‌ కొరియోగ్రఫీలో నారా రోహిత్‌ ఉత్సాహంగా డాన్స్‌ చేశారు. ఇందులో ఆయన న్యూస్‌ రిపోర్టర్‌ పాత్ర పోషించారు. సిరీ లెల్లా కథానాయిక.

Updated Date - Apr 17 , 2024 | 02:58 AM