విడిపోయిన జయం రవి దంపతులు
ABN , Publish Date - Sep 10 , 2024 | 03:39 AM
కోలీవుడ్ హీరో జయం రవి, ఆరతి జంట విడిపోయింది. తన భార్య ఆరతికి విడాకులు ఇస్తున్నట్లు జయం రవి ప్రకటించారు. 2009లో జయం రవి ఇరువైపు కుటుంబీకుల అంగీకారంతో...
కోలీవుడ్ హీరో జయం రవి, ఆరతి జంట విడిపోయింది. తన భార్య ఆరతికి విడాకులు ఇస్తున్నట్లు జయం రవి ప్రకటించారు. 2009లో జయం రవి ఇరువైపు కుటుంబీకుల అంగీకారంతో ఆరతిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. వీరి వైవాహిక జీవితం 15 ఏళ్లపాటు సాఫీగా కొనసాగింది. కొద్ది నెలలకు ముందు ఇరువురి మధ్య మనస్పర్థలు ఏర్పడటంతో విడిపోయారు. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం జయం రవి తన విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సినిమాల్లోనూ, నిజజీవితంలోనూ తాను ఎల్లప్పుడు పారదర్శకంగానే ఉంటానని, ఎలాంటి దాపరికాలకు తావులేదని భారమైన హృదయంతో ఓ చేదు విషయాన్ని చెప్పదలిచానని పేర్కొంటూ ఆరతితో వైవాహిక జీవితానికి స్వస్తి పలకాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తొందరపడి ఈ నిర్ణయం తీసుకోలేదని, ఆచితూచి, తనవారి సంక్షేమం దృష్ట్యా తీసుకున్న నిర్ణయమని జయం రవి తెలిపారు.
చెన్నై (ఆంధ్రజ్యోతి)