తిరుమలేశుడి సేవలో జాన్వీకపూర్
ABN , Publish Date - Aug 14 , 2024 | 03:00 AM
ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ యాక్టర్ జాన్వీ కపూర్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం రాత్రి కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆమె...
ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ యాక్టర్ జాన్వీ కపూర్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం రాత్రి కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆమె తన స్నేహితుడు శిఖర్ పహారియాతో కలిసి మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపానికి చేరుకోగా వేదపండితులు ఆశీర్వచనం చేశారు. శ్రీదేవి జీవించి ఉండగా ఏటా తన పుట్టిన రోజు నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందేవారు. జాన్వీకపూర్ ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
తిరుమల, (ఆంధ్రజ్యోతి)