అనారోగ్యంతో బాధపడుతున్న జాన్వీ కపూర్‌

ABN , Publish Date - Jul 19 , 2024 | 02:07 AM

బాలీవుడ్‌ నటి జాన్వీకపూర్‌ ఇటీవలే ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహీ’ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఓ పక్క వరుస బాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తూనే.. టాలీవుడ్‌లోనూ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, నాని సినిమాల్లో కథానాయిక ...

బాలీవుడ్‌ నటి జాన్వీకపూర్‌ ఇటీవలే ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహీ’ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఓ పక్క వరుస బాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తూనే.. టాలీవుడ్‌లోనూ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, నాని సినిమాల్లో కథానాయిక పాత్రను పోషిస్తున్నారీ బ్యూటీ. తాజాగా, ఆమె అనారోగ్యానికి గురయ్యారు. ఫుడ్‌ పాయిజనింగ్‌ వల్ల తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెనుముంబైలోని హాస్పిటల్‌లో చేర్చారు. జాన్వీ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని.. తన కూతురి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఆమె తండ్రి బోనీ కపూర్‌ వెల్లడించారు. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడ్డాక ఆమెను హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ చేస్తారని ఆయన చెప్పారు. ప్రస్తుతం జాన్వీ కపూర్‌ ‘ఉలఝ్‌’ అనే చిత్రంలో నటించారు. ఇందులో ఆమె పోషించే పాత్ర పేరు సుహాన భాటియా. దేశంలో అతి పిన్న వయసులోనే డిప్యూటీ సూపరింటెండెంట్‌గా ఎదిగిన సుహాన భాటియా విజయ ప్రస్థానమే ఈ సినిమా కథాంశం. సినిమా ఆగస్టు 2న విడుదలవుతోంది.

Updated Date - Jul 19 , 2024 | 02:07 AM