రాధిక తరహాలో జానకి

ABN , Publish Date - Apr 08 , 2024 | 12:59 AM

అశ్విని శ్రీ ప్రధాన పాత్ర పోషిస్తున్న లేడీ ఓరియంటెడ్‌ చిత్రం ‘మిస్‌ జానకి’. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తం షాట్‌కు నిర్మాత సీ కల్యాణ్‌ క్లాప్‌ ఇచ్చారు. సతీశ్‌ కుమార్‌ దర్శకత్వంలో...

రాధిక తరహాలో జానకి

అశ్విని శ్రీ ప్రధాన పాత్ర పోషిస్తున్న లేడీ ఓరియంటెడ్‌ చిత్రం ‘మిస్‌ జానకి’. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తం షాట్‌కు నిర్మాత సీ కల్యాణ్‌ క్లాప్‌ ఇచ్చారు. సతీశ్‌ కుమార్‌ దర్శకత్వంలో నాగరాజు నెక్కంటి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ‘ఈ నెల 20 నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభిస్తాం. రెండు షెడ్యూల్స్‌లో చిత్రీకరణ పూర్తిచేస్తాం’ అన్నారు. ‘ఈ చిత్రంతో హీరోయిన్‌కు మంచి పేరు వస్తుంది. ‘డీజే టిల్లు’ చిత్రంలో రాధిక తరహాలో అశ్విని శ్రీ పాత్ర కూడా ప్రేక్షకులను అలరిస్తుంది’ అని దర్శకుడు చెప్పారు. అలీ, తనికెళ్ల భరణి, చిత్రం శ్రీను కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వసంత్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: లక్ష్మీ కుమార్‌

Updated Date - Apr 08 , 2024 | 12:59 AM