‘జేమ్స్‌బాండ్‌ ఇన్‌ కుప్పం’

ABN , Publish Date - Jun 14 , 2024 | 03:38 AM

ప్రేమ కథల్లో ఎక్కువగా నటించే సుధీర్‌బాబు.. రూటు మార్చి నటించిన కంప్లీట్‌ యాక్షన్‌ ప్యాక్‌డ్‌ చిత్రం ‘హరోం హర’. ఈ చిత్రానికి జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వం వహించగా, సుమంత్‌.జి.నాయుడు నిర్మించారు. నేడు సినిమా విడుదలవుతున్న సందర్భంగా...

‘జేమ్స్‌బాండ్‌ ఇన్‌ కుప్పం’

ప్రేమ కథల్లో ఎక్కువగా నటించే సుధీర్‌బాబు.. రూటు మార్చి నటించిన కంప్లీట్‌ యాక్షన్‌ ప్యాక్‌డ్‌ చిత్రం ‘హరోం హర’. ఈ చిత్రానికి జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వం వహించగా, సుమంత్‌.జి.నాయుడు నిర్మించారు. నేడు సినిమా విడుదలవుతున్న సందర్భంగా హీరో సుధీర్‌బాబు మీడియాతో ముచ్చటించారు.


‘‘హరోంహర’ సరికొత్తగా చేసిన కమర్షియల్‌ సినిమా. ప్రేక్షకులకు ఈ కథా నేపథ్యం, మాటలు, సన్నివేశాలు కొత్త ప్రపంచాన్ని చూసిన అనుభూతిని ఇస్తాయి. నా దృష్టిలో కమర్షియల్‌ సినిమాల్లో కథ హీరో నుంచి మొదలైతేనే బాగుంటుంది. ఈ సినిమాను ‘జేమ్స్‌బాండ్‌ ఇన్‌ కుప్పం’ అనొచ్చు. ఇందులో నేను పోషించిన సుబ్రమణ్యం పాత్ర అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చుతుంది. ఇప్పటివరకూ తెలుగులో వచ్చిన పది ఉత్తమ యాక్షన్‌ చిత్రాల్లో ‘హరోం హర’ ఒకటిగా మిగిలిపోతుందనే నమ్మకం ఉంది. చాలా రోజుల తర్వాత కమెడియన్‌ సునీల్‌ ఈ సినిమాలో గుర్తుండిపోయే పాత్ర చేశారు. హీరోయిన్‌ మాళవిక శర్మ తన పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది. చేతన్‌ భరద్వాజ్‌ ఇచ్చిన సంగీతం థియేటర్స్‌ నుంచి బయటకు వచ్చాక కూడా ప్రేక్షకులని వెంటాడుతుంది’’ అని చెప్పారు.

Updated Date - Jun 14 , 2024 | 03:38 AM