ఐమాక్స్‌ 3డీలో జై హనుమాన్‌

ABN , Publish Date - Apr 24 , 2024 | 05:25 AM

పాన్‌ ఇండియా సంచలనం ‘హను-మాన్‌’ చిత్రానికి సీక్వెల్‌గా ‘జై హనుమాన్‌’ చిత్రం నిర్మించనున్నట్లు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఇదివరకే ప్రకటించారు...

ఐమాక్స్‌ 3డీలో జై హనుమాన్‌

పాన్‌ ఇండియా సంచలనం ‘హను-మాన్‌’ చిత్రానికి సీక్వెల్‌గా ‘జై హనుమాన్‌’ చిత్రం నిర్మించనున్నట్లు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఇదివరకే ప్రకటించారు. స్ర్కిప్ట్‌ కూడా లాక్‌ చేశారు. భారీ తారాగణం, సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయనున్నారు. అయోధ్యలోని రామ మందిరం ప్రారంభోత్సవం రోజున ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ప్రారంభించారు. హనుమంతుడి జయంతి సందర్భంగా మంగళవారం కొత్త పోస్టర్‌ విడుదల చేశారు. డ్రాగన్‌లను తొలిసారిగా ఇండియన్‌ స్ర్కీన్‌ మీదకు తీసుకొస్తున్నారు ప్రశాంత్‌ వర్మ. అలాగే ఐమాక్స్‌ 3ఢీ ఫార్మెట్‌లో ‘జై హనుమాన్‌’ విడుదల కానున్నట్లు ఈ పోస్టర్‌ ద్వారా ఆయన వెల్లడించారు.

Updated Date - Apr 24 , 2024 | 05:25 AM