జగ్జీవన్‌ రామ్‌ జీవన చిత్రం

ABN , Publish Date - Oct 25 , 2024 | 02:25 AM

మిలిటరీ ప్రసాద్‌ ప్రధాన పాత్రలో దిలీప్‌ రాజా దర్శకత్వంలో చందోలు నాగేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ‘జగ్జీవన్‌ రామ్‌’. మీరాకుమార్‌ పాత్రలో తాళ్లూరి రామేశ్వరి నటిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని...

మిలిటరీ ప్రసాద్‌ ప్రధాన పాత్రలో దిలీప్‌ రాజా దర్శకత్వంలో చందోలు నాగేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ‘జగ్జీవన్‌ రామ్‌’. మీరాకుమార్‌ పాత్రలో తాళ్లూరి రామేశ్వరి నటిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని ఆంధ్రప్రదేశ్‌ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌ విడుదల చేశారు. దర్శకుడు దిలీప్‌ రాజా మాట్లాడుతూ ‘వంద సంవత్సరాల క్రితం జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా నిర్మిస్తున్నాం. జలియన్‌వాలా బాగ్‌లో భారతీయులను అతి కిరాతకంగా చంపిన జనరల్‌ డయ్యర్‌ను భారత వీరుడు సర్దార్‌ ఉద్ధమ్‌ సింగ్‌ కాల్చి చంపే సన్నివేశం, నాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని జగ్జీవన్‌రామ్‌ విభేదించే దృశ్యాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తున్నాం’’ అని తెలిపారు.

Updated Date - Oct 25 , 2024 | 02:25 AM