మెరుపై వచ్చిండే..
ABN , Publish Date - Sep 10 , 2024 | 03:41 AM
జై భీమ్’ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న చిత్రం ‘వేట్టయాన్’ (వేటగాడు). అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్ కీలక పాత్రలు...
జై భీమ్’ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న చిత్రం ‘వేట్టయాన్’ (వేటగాడు). అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రజనీ కనిపించనున్నారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబరు 10న ప్రేక్షకులను పలకరించనుంది. సోమవారం ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘మనసిలాయో’ను మేకర్స్ విడుదల చేశారు. ‘మెరుపై వచ్చిండే.. మడత పెట్టి వచ్చిండే.. మనసు పెట్టి వచ్చిండే’ అంటూ సాగే ఈ హుషారైన మాస్ గీతంలో రజనీ సరసన మంజూ వారియర్ ఆడిపాడారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ పాటకు శ్రీనివాస మౌళి లిరిక్స్ అందించారు. నకాశ్ ఆజీజ్, అరుణ్ కౌండిన్య, దీప్తి సురేశ్ ఆలపించారు.