‘రత్నమాల’గా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతా

ABN , Publish Date - May 27 , 2024 | 01:14 AM

ఈ తరం కథానాయికలు ఎక్కువ చిత్రాల్లో నటించడం కాని.. ఎక్కువ కాలం కథానాయికగా కొనసాగడం కానీ అసాధ్యమనుకునే రోజులివి. కానీ ఆ లెక్కలను తలకిందులు చేసిన ప్రముఖ నటి అంజలి.. 50 చిత్రాలను పూర్తి చేసిన...

‘రత్నమాల’గా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతా

ఈ తరం కథానాయికలు ఎక్కువ చిత్రాల్లో నటించడం కాని.. ఎక్కువ కాలం కథానాయికగా కొనసాగడం కానీ అసాధ్యమనుకునే రోజులివి. కానీ ఆ లెక్కలను తలకిందులు చేసిన ప్రముఖ నటి అంజలి.. 50 చిత్రాలను పూర్తి చేసిన తారగా ఘనతను సాధించారు. ఆమె నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. విష్వక్‌సేన్‌ కథానాయకుడిగా నటించగా, కృష్ణచైతన్య దర్శకత్వం వహించారు. ఈ నెల 31న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించారు.


‘‘ఇప్పటివరకు నేను గర్ల్‌ నెక్ట్స్‌ డోర్‌ తరహా పాత్రలోనే ఎక్కువగా నటించాను. కెరీర్‌లో తొలిసారి ఇటువంటి మాస్‌ పాత్రలో నటించాను. ఇందులో నా పాత్ర పేరు ‘రత్నమాల’, హీరో పాత్ర పేరు ‘రత్నాకర్‌’. సినిమాలో మా ఇద్దరినీ అందరూ ‘రత్న’ అనే పిలుస్తుంటారు. డైరెక్టర్‌ ఈ పాత్రను మలిచిన తీరు చాలా బాగుంటుంది. ఇందులో బెస్ట్‌ ఇవ్వటం కోసం చాలా శ్రమించాను. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ సినిమాతో పాటు నా పాత్ర కూడా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతాయి. విశ్వక్‌ సేన్‌ నాకు ముందునుంచి మంచి స్నేహితుడు. సినిమాలో మా ఇద్దరి పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. ఇక దర్శకుడు కథ చెప్పేటప్పుడు ఎంత బాగా చెప్పారో.. అంతకంటే బాగా సినిమాను తీశారు. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ సినిమా అందరూ చూసి ఎంజాయ్‌ చేసేలా ఉంటుంది, ముఖ్యంగా మాస్‌ ప్రేక్షకులకు మరింత చేరువవుతుంది’’ అని చెప్పారు.

Updated Date - May 27 , 2024 | 01:14 AM