మా జోలికొస్తే మాకడ్డువస్తే మామూలుగా ఉండదు..

ABN , Publish Date - Jan 02 , 2024 | 05:13 AM

క్లాస్‌ కేరక్టర్‌ చేసినా మాస్‌ కేరక్టర్‌ చేసినా ఒదిగిపోయి నటించడం నాగార్జున ప్రత్యేకత. రానున్న సంక్రాంతికి ‘నా సామిరంగ’ అంటూ బాక్సాఫీస్‌పై యుద్ధానికి సిద్ధమయ్యారు నాగ్‌. విజయ్‌ బిన్ని...

మా జోలికొస్తే మాకడ్డువస్తే మామూలుగా ఉండదు..

క్లాస్‌ కేరక్టర్‌ చేసినా మాస్‌ కేరక్టర్‌ చేసినా ఒదిగిపోయి నటించడం నాగార్జున ప్రత్యేకత. రానున్న సంక్రాంతికి ‘నా సామిరంగ’ అంటూ బాక్సాఫీస్‌పై యుద్ధానికి సిద్ధమయ్యారు నాగ్‌. విజయ్‌ బిన్ని దర్శకత్వంలో శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ సాంగ్‌, లిరికల్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ’మాజోలికొస్తే.. మాకడ్డువస్తే.. మామూలుగా వుండదు.. నా సామిరంగ.. ఈ గీత తొక్కితే.. మా సేత సిక్కితే.. మామూలుగా ఉండదు.. నా సామిరంగ’ అంటూ హీరో పాత్ర లక్షణాలను తెలియజేస్తూ చంద్రబోస్‌ రాసిన ఈ పాటను మాస్‌ మెచ్చేలా ఎం.ఎం.కీరవాణి స్వరపరిచారని, కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ హై ఎనర్జీతో ఈ పాటను ఆలపించారని, నాగార్జున, అల్లరి నరేశ్‌,, రాజ్‌ తరుణ్‌లతోపాటు మూడు వందలమంది డాన్సర్స్‌ పాల్గొనగా దినేశ్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించిన ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్‌ చెబుతున్నారు. స్నేహం, భావోద్వేగాల మేళవింపుగా రూపొందిన ‘నా సామిరంగ’ సంక్రాంతికి పర్‌ఫెక్ట్‌ మూవీ అని వారు అన్నారు. ఆశికా రంగనాథ్‌ కథానాయికగా నటిస్తున్న ఈ హైబడ్జెట్‌ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, కథ, మాటలు: ప్రసన్నకుమార్‌ బెజవాడ.

Updated Date - Jan 02 , 2024 | 05:14 AM