వరుణ్‌ కెరీర్‌కు మైలురాయిగా మారుతుంది

ABN , Publish Date - Jun 18 , 2024 | 03:40 AM

వరుణ్‌ సందేశ్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘నింద’. కాండ్రకోట మిస్టరీ ఉప శీర్షిక. రాజేశ్‌ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘నింద’ చిత్రం ఈ నెల 21న...

వరుణ్‌ కెరీర్‌కు మైలురాయిగా మారుతుంది

వరుణ్‌ సందేశ్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘నింద’. కాండ్రకోట మిస్టరీ ఉప శీర్షిక. రాజేశ్‌ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘నింద’ చిత్రం ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో నిఖిల్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా వరుణ్‌సందేశ్‌ కెరీర్‌కు మైలురాయిగా మారుతుంది. అందరూ సినిమాను పెద్ద సక్సెస్‌ చేయాలి’’ అని కోరారు. ‘‘ఇన్నేళ్ల కెరీర్‌లో నా మనసుకు బాగా దగ్గరైన చిత్రం ‘నింద’’ అని వరుణ్‌ సందేశ్‌ చెప్పారు. ‘‘నింద’ మూవీ వరుణ్‌ కమ్‌బ్యాక్‌కు నాంది పలుకుతుంది’’ అని దర్శకనిర్మాత రాజేశ్‌ జగన్నాథం అన్నారు.

Updated Date - Jun 18 , 2024 | 03:40 AM