అరుదైన సినిమా అవుతుంది

ABN , Publish Date - Mar 01 , 2024 | 06:35 AM

‘‘గామి’ అరుదైన సినిమా. ఆరేళ్లపాటు అంకితభావంతో తెరకెక్కించడం మామూలు విషయం కాదు. సినిమాపై ఎంతో ప్రేమ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు’ అని దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా అన్నారు...

అరుదైన సినిమా అవుతుంది

‘‘గామి’ అరుదైన సినిమా. ఆరేళ్లపాటు అంకితభావంతో తెరకెక్కించడం మామూలు విషయం కాదు. సినిమాపై ఎంతో ప్రేమ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు’ అని దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా అన్నారు. విష్వక్‌సేన్‌ కథానాయకుడిగా విధ్యాధర్‌ కాగిత దర్శకత్వం వహించిన ‘గామి’ చిత్రం ట్రైలర్‌ను సందీప్‌రెడ్డి వంగా విడుదల చేశారు. విష్వక్‌సేన్‌ మాట్లాడుతూ ‘ఇది రెగ్యులర్‌ చిత్రం కాదు. మాస్‌ అంశాలు ఉండవు. అయినా ‘గామి’ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. తెలుగు పరిశ్రమ గర్వపడే సినిమా అవుతుంది’ అన్నారు. సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరగబోతోందో అనే ఉత్సుకత ప్రేక్షకుల్లో కలుగుతుందని విద్యాధర్‌ తె లిపారు. ఈ సినిమాకు పనిచేసినవారికీ, సాయం చేసిన వారికి నిర్మాత శబరీషన్‌ ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Mar 01 , 2024 | 06:35 AM