పెద్ద హిట్‌ అవుతుంది

ABN , Publish Date - May 17 , 2024 | 02:41 AM

‘ఈ సినిమాకు అరుణ్‌, నాగ బలం. నేను ఇంతవరకూ దర్శకుల్ని పరిచయం చేశాను. తొలిసారిగా నాగను నిర్మాతగా ఇంట్రడ్యూస్‌ చేస్తున్నాను. ట్రైలర్‌ చూస్తే టీమ్‌ పడిన కష్టం తెలుస్తుంది....

పెద్ద హిట్‌ అవుతుంది

‘ఈ సినిమాకు అరుణ్‌, నాగ బలం. నేను ఇంతవరకూ దర్శకుల్ని పరిచయం చేశాను. తొలిసారిగా నాగను నిర్మాతగా ఇంట్రడ్యూస్‌ చేస్తున్నాను. ట్రైలర్‌ చూస్తే టీమ్‌ పడిన కష్టం తెలుస్తుంది.

ఇది న్యూ ఏజ్‌ లవ్‌ స్టోరీ అవుతుంది. ఈ నెల 25న వస్తున్న మా సినిమా పెద్ద హిట్‌ అవుతుందని ఆశిస్తున్నా’ అన్నారు దిల్‌ రాజు. ఆశిష్‌, వైష్ణవి చైతన్య జంటగా నటించిన హారర్‌ థ్రిల్లర్‌ ‘లవ్‌ మీ’ ట్రైలర్‌ను గురువారం విడుదల చేసిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శిరిష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి ఈ సినిమాను నిర్మించారు.


దర్శకుడు అరుణ్‌ భీమవరపు మాట్లాడుతూ ‘యుద్ధం చేయడం కంటే ప్రేమించడానికి గట్స్‌ కావాలి. మనిషి ప్రేమను పొందడమే కష్టం అనుకుంటే దెయ్యాన్ని ప్రేమించడం ఇంకెంత కష్టమో ఆలోచించండి. ఆశిష్‌ ఈ పాత్రను అద్భుతంగా పోషించాడు. గంగాదేవిలాంటి పాత్రను వైష్ణవి చేశారు. ఈ ప్రపంచాన్ని ప్రేమే నడిపిస్తోంది. ‘వై’ అనే క్వశ్చన్‌ లేకుండా ‘వావ్‌’ అనుకుని ఈ సినిమాను చూసి ఎంజాయ్‌ చేయండి’ అన్నారు.

‘ఇంత మంచి సినిమా చేసే అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు. మా సినిమాతో మళ్లీ థియేటర్లు కళకళలాడతాయి’ అన్నారు ఆశిష్‌. ఈ చిత్రంలో డిఫరెంట్‌గా, టఫ్‌గా ఉండే పాత్రను పోషించానని వైష్ణవి చైతన్య చెప్పారు.

Updated Date - May 17 , 2024 | 02:41 AM