Razakar : కష్టమైనా ఇష్టంతో చేశా

ABN , Publish Date - Mar 17 , 2024 | 05:25 AM

బాబీ సింహా, మకరంద్‌ దేశ్‌ పాండే, అనుశ్రీ ప్రధాన పాత్రల్లో యాట సత్యనారాయణ దర్శకత్వంలో, గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన చిత్రం ‘రజాకార్‌’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి...

Razakar : కష్టమైనా ఇష్టంతో చేశా

బాబీ సింహా, మకరంద్‌ దేశ్‌ పాండే, అనుశ్రీ ప్రధాన పాత్రల్లో యాట సత్యనారాయణ దర్శకత్వంలో, గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన చిత్రం ‘రజాకార్‌’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఈ నేపధ్యంలో అనుశ్రీ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ‘రజాకార్‌’ ఈ నేల కథ. సినిమాకి వస్తున్న రెస్పాన్స్‌ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు చాలా ఎమోషనల్‌ అవుతున్నారు. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుల కళ్ళలో దేశభక్తి కనిపించింది. వందేమాతరం, భారత్‌ మాతాకీ జై అనే నినాదాలు థియేటర్స్‌లో మార్మోగడం చూసి, ఇలాంటి సినిమాలో భాగమైనందుకు ఆనందంగా అనిపించింది. ఈ చిత్రంలో నిజాం భార్యగా కనిపించా. కథ చెప్పినపుడు ఈ పాత్ర పోషించడం సవాల్‌గా అనిపించింది. ఈ పాత్ర కోసం మూడు నెలలు పాటు మెథడ్‌ ట్రైనింగ్‌ కూడా తీసుకున్నా. ‘రజాకార్‌‘లో నటించడం చాలా గొప్ప అనుభవం. చాలా మంది ప్రముఖ నటులతో కలసిపని చేేస అవకాశం దక్కింది. బాబీ సింహ, రాజ్‌ అర్జున్‌తో పాటు మకరంద్‌ దేశ్‌ పాండే లాంటి అద్భుతమైన యాక్టర్స్‌ తో స్ర్కీన్‌ పంచుకోవడం గొప్ప అనుభూతి. మోడలింగ్‌ నుంచి కెరీర్‌ మొదలుపెట్టాను. 2018లో చత్తీ్‌సఘడ్‌ నుంచి మిస్‌ ఇండియా పోటిల్లో కూడా పాల్గొన్నాను’’ అని చెప్పారు.

Updated Date - Mar 17 , 2024 | 05:27 AM