గుడిలా మార్చేశా

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:24 AM

కొద్ది రోజులుగా దివంగత బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఇంటిపై జరుగుతున్న చర్చపై నటి అదాశర్మ మీడియాకు క్లారిటీ ఇచ్చారు. ఆ ఇంటిని కొనుగోలు చేసినట్లు...

గుడిలా మార్చేశా

కొద్ది రోజులుగా దివంగత బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఇంటిపై జరుగుతున్న చర్చపై నటి అదాశర్మ మీడియాకు క్లారిటీ ఇచ్చారు. ఆ ఇంటిని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ‘‘సుశాంత్‌ నివసించిన ఇంట్లోనే ప్రస్తుతం ఉంటున్నాను. చుట్టూ పాజిటివ్‌గా ఉండే ఆహ్లాద వాతావరణం నన్నెంతగానో ఆకట్టుకుంది. ముంబై, కేరళలోని మా సొంతిళ్లను తలపించేలా ఉన్న ఈ ఇంటిని అందుకే కొన్నాను. ఇందులోని మొదటి అంతస్తును గుడిలా.. ఒక రూమ్‌ను మ్యూజిక్‌ రూమ్‌లా.. మరో గదిని డ్యాన్స్‌ స్టూడియోగా రీమోడలింగ్‌ చేయించాను. టెర్రేస్‌ను గార్డెన్‌లా మార్చేశాను’’ అని చెప్పారు. కాగా, గతేడాది ఈ నటి, సుశాంత్‌ ఇంటి వద్ద కనిపించినప్పటి నుంచి ఆమె ఈ ఇంటిని కొనుగోలు చేశారని ఊహాగానాలు వినపడిన సంగతి తెలిసిందే.

Updated Date - Jun 04 , 2024 | 12:24 AM