సవాల్‌గా అనిపించింది

ABN, Publish Date - Jul 15 , 2024 | 02:49 AM

దాదాపు మూడేళ్ల గ్యాప్‌ తరువాత ‘డార్లింగ్‌’. ‘వై దిస్‌ కొలవెరీ’(ఉపశీర్షిక) చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించనున్నారు నభా నటేశ్‌. అశ్విన్‌రామ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో...

దాదాపు మూడేళ్ల గ్యాప్‌ తరువాత ‘డార్లింగ్‌’. ‘వై దిస్‌ కొలవెరీ’(ఉపశీర్షిక) చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించనున్నారు నభా నటేశ్‌. అశ్విన్‌రామ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియదర్శి కథానాయకుడిగా నటించగా, కె.నిరంజన్‌రెడ్డి, చైతన్య నిర్మించారు. సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నభా మీడియాతో ముచ్చటించారు. ‘‘ఈ సినిమా కథను డైరెక్టర్‌ చెప్పగానే ఒప్పేసుకున్నాను. ఇందులో నా పాత్రకు స్ప్లిట్‌ పర్సనాలిటీ డిజార్డర్‌ ఉంటుంది. విభిన్న షేడ్స్‌ ఉన్న ఈ పాత్ర ఎంతో చాలెంజింగ్‌గా అనిపించింది. నేను ఇప్పటివరకూ ఇలాంటి రోల్‌ చేయలేదు. ఇదొక పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌. ఈ సినిమాలో లవ్‌, కామెడీ, డ్రామా, ఎమోషన్స్‌ అన్నీ సమపాళ్లలో ఉంటాయి. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే చిత్రమిది. ప్రియదర్శి కామెడీ టైమింగ్‌ చిత్రానికే హైలైట్‌గా ఉంటుంది. దర్శకుడు కథను చెప్పినదానికంటే మరింత బాగా తెరకెక్కించారు’’ అని చెప్పారు.

Updated Date - Jul 15 , 2024 | 02:49 AM