సైన్యానికి సెల్యూట్‌ చేసేలా ఉంటుంది

ABN , Publish Date - Feb 21 , 2024 | 03:58 AM

‘కొత్త కథ చూపించాలనే ఫ్యాషన్‌తో ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాం. ఈ సినిమా చూశాక ప్రేక్షకులు గర్వంగా, గుండెల నిండా దేశభక్తితో మన సైనికులకు సెల్యూట్‌ చేస్తారు’...

సైన్యానికి సెల్యూట్‌ చేసేలా ఉంటుంది

‘కొత్త కథ చూపించాలనే ఫ్యాషన్‌తో ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాం. ఈ సినిమా చూశాక ప్రేక్షకులు గర్వంగా, గుండెల నిండా దేశభక్తితో మన సైనికులకు సెల్యూట్‌ చేస్తారు’ అని హీరో వరుణ్‌తేజ్‌ అన్నారు. ఆయన హీరోగా శక్తి ప్రతాప్‌సింగ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్‌ కథానాయిక. మార్చి 1న ఈ చిత్రం విడుదలవుతోంది. మంగళవారం ఈ చిత్రం తెలుగు, హిందీ ట్రైలర్స్‌ను రామ్‌చరణ్‌, సల్మాన్‌ఖాన్‌ ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వరుణ్‌తేజ్‌ మాట్లాడుతూ ‘తెలుగులో ఇదే తొలి ఏరియల్‌ వార్‌ డ్రామా. ప్రేక్షకులను ఆద్యంతం ఉత్కంఠకు గురి చేసేలా, అబ్బురపరిచే సన్నివేశాలు ఇందులో చాలా ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమా మిమ్మల్ని అలరిస్తుంది’ అన్నారు. మానుషి చిల్లర్‌ మాట్లాడుతూ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌ నాకు చాలా స్పెషల్‌ మూవీ. షూటింగ్‌లో వరుణ్‌తేజ్‌ సహకారం మరువలేనిది. నా డ్రీమ్‌ రోల్‌ను చేశాను’ అని తెలిపారు. సమష్టి కృషికి రూపం ఈ సినిమా, యాక్షన్‌ డ్రామా, ఫన్‌ ఎమోషన్స్‌ లాంటి అన్ని ఎలిమెంట్స్‌ ఈ చిత్రంలో ఉన్నాయి అని దర్శకుడు చెప్పారు. ఈ సినిమాలో కీలకమైన పాత్ర చేశాను, విజువల్స్‌ ఎక్స్‌ట్రార్డీనరీగా ఉంటాయి అని నవదీప్‌ తెలిపారు.

Updated Date - Feb 21 , 2024 | 03:58 AM