అందరినీ మెప్పిస్తుందనే నమ్మకం ఉంది

ABN , Publish Date - Feb 29 , 2024 | 05:04 AM

శివ కందుకూరి హీరోగా రూపొందిన క్రైమ్‌థ్రిల్లర్‌ ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’. పురుషోత్తం రాజ్‌ దర్శకత్వంలో స్నేహాల్‌, శశిధర్‌, కార్తీక్‌ నిర్మించారు. రాశి సింగ్‌ కథానాయిక. మార్చి 1న ఈచిత్రం...

అందరినీ మెప్పిస్తుందనే నమ్మకం ఉంది

శివ కందుకూరి హీరోగా రూపొందిన క్రైమ్‌థ్రిల్లర్‌ ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’. పురుషోత్తం రాజ్‌ దర్శకత్వంలో స్నేహాల్‌, శశిధర్‌, కార్తీక్‌ నిర్మించారు. రాశి సింగ్‌ కథానాయిక. మార్చి 1న ఈచిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్‌ ట్రైలర్‌ ఈవెంట్‌ను చిత్రబృందం నిర్వహించింది. శివ కందుకురి మాట్లాడుతూ ‘‘భూతద్ధం...’ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. సినిమా అందరికీ నచ్చతుందనే నమ్మకం ఉంది. గీతా డిస్ట్రిబ్యూషన్‌ విడుదల వల్ల సినిమా మరింత మంది ప్రేక్షకులకు చేరువవుతుంది’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమాతో దర్శకుడిగా నా కల నెరవేరింది. శ్రీ చరణ్‌ అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు. శివ లాంటి హీరో దొరికినందుకు ఆనందంగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఆదరించండి’ అని ప్రేక్షకులను కోరారు. రాశి సింగ్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. కథ వినూత్నంగా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి’ అన్నారు. ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి, బిజినెస్‌ అద్భుతంగా జరిగింది అని నిర్మాతలు చెప్పారు.

Updated Date - Feb 29 , 2024 | 05:04 AM