తెలుగులోనూ ఆదరిస్తారు

ABN , Publish Date - Aug 22 , 2024 | 12:09 AM

హారర్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను భయపెట్టిన ‘డీమాంటి కాలనీ’కి సీక్వెల్‌గా తెరకెక్కిన తమిళ చిత్రం ‘డీమాంటీ కాలనీ 2’. అజయ్‌.ఆర్‌.జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను బి.సురేశ్‌ రెడ్డి, బి.మానస రెడ్డి నిర్మించారు. అరుల్‌నిధి, ప్రియా

హారర్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను భయపెట్టిన ‘డీమాంటి కాలనీ’కి సీక్వెల్‌గా తెరకెక్కిన తమిళ చిత్రం ‘డీమాంటీ కాలనీ 2’. అజయ్‌.ఆర్‌.జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను బి.సురేశ్‌ రెడ్డి, బి.మానస రెడ్డి నిర్మించారు. అరుల్‌నిధి, ప్రియా భవానీశంకర్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. సినిమా ఈ శుక్రవారం విడుదలవుతోన్న సందర్భంగా చిత్రబృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ ‘‘మంచి కంటెంట్‌ ఉన్న ఇలాంటి సినిమాను తెలుగులోను ఆదరిస్తారు’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమాకు కొనసాగింపుగా మరో రెండు భాగాలు ఉంటాయి’’ అని దర్శకుడు అజయ్‌.ఆర్‌.జ్ఞానముత్తు అన్నారు.

Updated Date - Aug 22 , 2024 | 12:09 AM