అది ఫేక్‌ అకౌంట్‌

ABN , Publish Date - Jun 18 , 2024 | 03:34 AM

‘మిస్టర్‌ అండ్‌ మిస్సెస్‌ మహీ’ చిత్రంతో సూపర్‌ హిట్‌ కొట్టిన ఆనందంలో ఉన్నారు బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌. తాజాగా ఆ సంతోషాన్ని ఆవిరి చేసేలా ఓ సంఘటన జరిగింది...

అది ఫేక్‌ అకౌంట్‌

‘మిస్టర్‌ అండ్‌ మిస్సెస్‌ మహీ’ చిత్రంతో సూపర్‌ హిట్‌ కొట్టిన ఆనందంలో ఉన్నారు బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌. తాజాగా ఆ సంతోషాన్ని ఆవిరి చేసేలా ఓ సంఘటన జరిగింది. అదేంటంటే ఆమె ఎక్స్‌ ఖాతా నుంచి ఆశ్లీల ఫొటోలు ప్రత్యక్షమవ్వడం. దీంతో ఒక్కసారిగా ఆమెతో పాటు జాన్వీ ఫ్యాన్స్‌ ఆందోళనకు గురయ్యారు. దీనిపై స్పందించిన జాన్వీ టీమ్‌.. ఆ ఫొటోలు పోస్ట్‌ చేసింది ఫేక్‌ అకౌంట్‌ నుంచి అని.. అసలు జాన్వీకి ఎక్స్‌ ఖాతానే లేదని స్పష్టతనిచ్చింది. సోషల్‌ మీడియాలో ఇలాంటి నకిలీ ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Updated Date - Jun 18 , 2024 | 03:34 AM