‘రాజారాణి’ ఫీల్‌ కలిగింది

ABN , Publish Date - Apr 10 , 2024 | 01:45 AM

జీవీ ప్రకాశ్‌కుమార్‌, ఐశ్వర్యా రాజేశ్‌ నటించిన ఫ్యామిలీ డ్రామా ‘డియర్‌’. ఆనంద్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించారు. వరుణ్‌ త్రిపురనేని, అభిషేక్‌ రామిశెట్టి, జి పృథ్విరాజ్‌ నిర్మించారు. ఈ చిత్రం తమిళంలో...

‘రాజారాణి’ ఫీల్‌ కలిగింది

జీవీ ప్రకాశ్‌కుమార్‌, ఐశ్వర్యా రాజేశ్‌ నటించిన ఫ్యామిలీ డ్రామా ‘డియర్‌’. ఆనంద్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించారు. వరుణ్‌ త్రిపురనేని, అభిషేక్‌ రామిశెట్టి, జి పృథ్విరాజ్‌ నిర్మించారు. ఈ చిత్రం తమిళంలో ఈ నెల11న, తెలుగులో 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో జీవీ ప్రకాశ్‌ మాట్లాడుతూ ‘‘డియర్‌ అందరూ రిలేట్‌ చేసుకునే సినిమా. ఇందులో అన్ని రకాల ఎమోషన్స్‌ ఉన్నాయి. ఈ సినిమా కథ విన్నప్పుడు ‘రాజారాణి’ మూవీ ఫీల్‌ కలిగింది’’ అని చెప్పారు. దర్శకుడు ఆనంద్‌రవిచంద్రన్‌ మాట్లాడుతూ ‘‘గురక పెట్టడం ప్రతీ ఇంట్లో ఉండే సమస్య. దీనిపై కథ రాయడం చాలా కొత్తగా అనిపించింది. ఈ సినిమాలో జీవీ ప్రకాశ్‌, ఐశ్వర్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది’’ అని అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా గ్రాండ్‌ సక్సెస్‌ అవుతుంది’’ అని ఆకాంక్షించారు. నటి ఐశ్వర్య మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో అందరినీ ఆకట్టుకునే కంటెంట్‌ ఉంది’’ అని చెప్పారు.

Updated Date - Apr 10 , 2024 | 01:45 AM