పాన్ ఇండియా సినిమాలా అనిపించింది
ABN , Publish Date - Oct 19 , 2024 | 06:25 AM
యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల జంటగా నటించిన చిత్రం ‘పొట్టేల్’. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో నిశాంక్‌రెడ్డి కుడితి, సురేశ్‌కుమార్ సడిగె నిర్మించారు. ఈ నెల 25న ఈ
సంయుక్త
యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల జంటగా నటించిన చిత్రం ‘పొట్టేల్’. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో నిశాంక్‌రెడ్డి కుడితి, సురేశ్‌కుమార్ సడిగె నిర్మించారు. ఈ నెల 25న ఈ చిత్రం విడుదలవుతోంది. శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో కథానాయిక సంయుక్త ‘పొట్టేల్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సంయుక్త మాట్లాడుతూ ‘దర్శకుడు నాలుగేళ్లు కష్టపడి కథను సిద్ధం చేశాడు. అద్భుతంగా తెరపైన ఆవిష్కరించాడు. ట్రైలర్‌లో తొలి షాట్ చూడగానే రియల్ పాన్ ఇండియన్ ఫిల్మ్ అనిపించింది. ప్రతిభావంతులైన నటీనటులు ఈ సినిమాతో వెండితెరకు పరిచయమవుతున్నందుకు ఆనందంగా ఉంది. అజయ్ పాత్ర ఆసక్తికరంగా అనిపించింది. నిర్మాతల అభిరుచి వల్లే ఇంత మంచి చిత్రం రూపుదిద్దుకుంది’ అని ప్రశంసించారు. అనన్య మాట్లాడుతూ ‘ట్రైలర్‌లో చూసింది కొంచెమే. మా సినిమా కొన్ని రోజుల పాటు ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంది. వాణిజ్య హంగులతో పాటు చక్కని కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’ అని చెప్పారు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుల స్పందన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని సాహిత్ చెప్పారు. విక్రమార్కుడు చిత్రం తర్వాత ఆ స్థాయిలో ఉన్న విలన్ పాత్రను ఈ సినిమాలో చేశాను అని అజయ్ తెలిపారు.