ఇస్మార్ట్‌ సాంగ్‌

ABN , Publish Date - Jun 27 , 2024 | 12:17 AM

రామ్‌ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రానికి ఇది సీక్వెల్‌. సంజయ్‌దత్‌ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు..

ఇస్మార్ట్‌ సాంగ్‌

రామ్‌ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రానికి ఇది సీక్వెల్‌. సంజయ్‌దత్‌ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం విడుదలవుతోంది. టైటిల్‌ సాంగ్‌ను ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా రామ్‌ పోతినేని స్పెషల్‌ పోస్టర్‌ను బుధవారం మేకర్స్‌ విడుదల చేశారు. ఈ గీతాన్ని మణిశర్మ స్వర పరచగా, జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. రామ్‌కు జోడీగా కావ్య థాపర్‌ నటిస్తున్నారు. పూరి జగన్నాథ్‌, ఛార్మీకౌర్‌ నిర్మిస్తున్నారు.

Updated Date - Jun 27 , 2024 | 12:17 AM