కొత్త కలయిక కుదిరిందా?

ABN , Publish Date - Jun 19 , 2024 | 04:11 AM

‘ఫైటర్‌’ చిత్రంతో తనదైన యాక్షన్‌తో అభిమానులను ఎంటర్‌ టైన్‌ చేశారు బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌. ప్రస్తుతం ఆయన ‘వార్‌ 2’ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. సెప్టెంబర్‌ కల్లా ‘వార్‌ 2’లో తన పాత్రకు సంబంధించిన...

కొత్త కలయిక కుదిరిందా?

‘ఫైటర్‌’ చిత్రంతో తనదైన యాక్షన్‌తో అభిమానులను ఎంటర్‌ టైన్‌ చేశారు బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌. ప్రస్తుతం ఆయన ‘వార్‌ 2’ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. సెప్టెంబర్‌ కల్లా ‘వార్‌ 2’లో తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తి చే సి, కొత్త సినిమాపై దృష్టి సారించాలని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు దర్శకులు హృతిక్‌ను కలసి కథలు వినిపిస్తున్నారు. అయితే ఆయన మాత్రం కబీర్‌ ఖాన్‌ చెప్పిన కథపై ఆసక్తి చూపినట్లు బాలీవుడ్‌ సర్కిల్లో వినిపిస్తోంది. విచిత్ర జీవుల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందట. ‘చందు ఛాంపియన్‌’ చిత్రం విడుదలవ్వడంతో కబీర్‌ఖాన్‌ కూడా హృతిక్‌తో సినిమాపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నారు. ప్రస్తుతానికి కథా చర్చలు జరుగుతున్నాయి. తనకు కొత్త తరహా కథాంశం కావడంతో హృతిక్‌ కూడా ఆసక్తి చూపడంతో ఈ కాంబినేషన్‌ సెట్టయ్యే అవకాశాలే ఎక్కువనేది బాలీవుడ్‌ టాక్‌. అన్ని అనుకూలిస్తే కొత్త ఏడాదిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.

Updated Date - Jun 19 , 2024 | 09:34 AM