కలయిక కుదిరిందా?

ABN , Publish Date - Jun 26 , 2024 | 05:49 AM

దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ హిట్‌ చిత్రాలతో టాప్‌ కథానాయికగా ఎదిగారు రష్మిక మందన్న. అక్కడి అగ్ర దర్శకులు, నిర్మాతల నుంచి హీరోయిన్‌గా అవకాశాలు వెల్లువెత్తుతున్నా ఆమె మాత్రం...

కలయిక కుదిరిందా?

దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ హిట్‌ చిత్రాలతో టాప్‌ కథానాయికగా ఎదిగారు రష్మిక మందన్న. అక్కడి అగ్ర దర్శకులు, నిర్మాతల నుంచి హీరోయిన్‌గా అవకాశాలు వెల్లువెత్తుతున్నా ఆమె మాత్రం ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటున్నారు. అయితే రష్మిక ఓ కొత్త ప్రాజెక్ట్‌కు ‘ఎస్‌’ చెప్పారని ప్రస్తుతం బాలీవుడ్‌లో వినిపిస్తోంది. ‘స్త్రీ, భేడియా, ముంజ్యా’ లాంటి హారర్‌ చిత్రాలతో నిర్మాతగా వరుస విజయాలను దక్కించుకున్న దినేశ్‌ విజన్‌ గ్రామీణ నేపథ్యంలో ‘వాంపైర్స్‌ ఆఫ్‌ విజయ్‌ నగర్‌’ పేరుతో ఓ హారర్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఆయుష్మాన్‌ ఖురానా కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జోడీగా రష్మికను ఎంపిక చేశారని అక్కడి పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే అధికారిక ప్రకటన వస్తేనే ఈ కాంబినేషన్‌పై స్పష్టత వస్తుంది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్‌ ‘పుష్ప 2: ది రూల్‌’, సల్మాన్‌ఖాన్‌ ‘సికందర్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు.

Updated Date - Jun 26 , 2024 | 05:49 AM