కలయిక కుదిరిందా?

ABN , Publish Date - Feb 09 , 2024 | 03:09 AM

‘విక్రమ్‌’ చిత్రంతో కమల్‌హాసన్‌ను సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కించారు దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌. ఇప్పుడు కమల్‌హాసన్‌ కూతురు శ్రుతీహాసన్‌తో ఆయన ఓ చిత్రం చేయబోతున్నారనే వార్త కోలీవుడ్‌లో వినిపిస్తోంది...

కలయిక కుదిరిందా?

‘విక్రమ్‌’ చిత్రంతో కమల్‌హాసన్‌ను సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కించారు దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌. ఇప్పుడు కమల్‌హాసన్‌ కూతురు శ్రుతీహాసన్‌తో ఆయన ఓ చిత్రం చేయబోతున్నారనే వార్త కోలీవుడ్‌లో వినిపిస్తోంది. వీరిద్దరు కలసి దిగిన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడం ఈ చర్చకు మరింత ఊపునిచ్చింది. వీరిద్దరి కాంబోలో లేడీ ఓరియంటెడ్‌ చిత్రం తెరకెక్కుతోందని అంటున్నారు. అయితే శ్రుతీ, లోకేశ్‌ తో కమల్‌హాసన్‌ ఓ మ్యూజిక్‌ ఆల్బమ్‌ తెరకెక్కిస్తున్నారనే వార్త సైతం వినిపిస్తోంది. అధికారిక ప్రకటన వస్తే తప్ప దీనిపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.

Updated Date - Feb 09 , 2024 | 03:09 AM