ప్రేమంటారా? కాదంటారా?
ABN , Publish Date - Nov 25 , 2024 | 03:14 AM
ప్రేమలో ఉన్నామని పైకి చెప్పకపోయినా తరచూ చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతూ కెమెరాలకు చిక్కుతున్నారు విజయ్‌దేవరకొండ, రష్మిక మందన్న. తాజాగా ఈ జంట మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించింది...
ప్రేమలో ఉన్నామని పైకి చెప్పకపోయినా తరచూ చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతూ కెమెరాలకు చిక్కుతున్నారు విజయ్‌దేవరకొండ, రష్మిక మందన్న. తాజాగా ఈ జంట మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించింది. వీరిద్దరూ కలసి ఓ రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెన్నైలో నిర్వహించిన ‘పుష్ప 2’ కార్యక్రమంలో ‘మీ ప్రేమ, పెళ్లి గురించి చెప్పండి’ అని యాంకర్ రష్మికను అడగ్గా ‘తొందరెందుకు ‘పుష్ప 2’ విడుదలయ్యాక మీరే చూస్తారు కదా’ అని బదులిచ్చారు. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తా, బయట వ్యక్తా అని అడిగితే ‘అది అందరికీ తెలిసిన విషయమే కదా’ అంటూ స్పందించారు.