భారతీయుడు 2 ముగించారా?

ABN , Publish Date - Jan 03 , 2024 | 01:26 AM

కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఇండియన్‌ 2’. (తెలుగులో ‘భారతీయుడు 2). గతంలో శంకర్‌ దర్శకుడిగా వచ్చిన ‘భారతీయుడు’ చిత్రానికి ఇది సీక్వెల్‌. నత్త నడకను...

భారతీయుడు 2 ముగించారా?

కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఇండియన్‌ 2’. (తెలుగులో ‘భారతీయుడు 2). గతంలో శంకర్‌ దర్శకుడిగా వచ్చిన ‘భారతీయుడు’ చిత్రానికి ఇది సీక్వెల్‌. నత్త నడకను తలపించిన ఈ చిత్రం షూటింగ్‌ ఎట్టకేలకు ముగిసిందని తెలుస్తోంది. కమల్‌హాసన్‌ యూనిట్‌తో కలసి దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. ఈ ఫొటోను బట్టి ‘ఇండియన్‌ 2’ చిత్రీకరణ ముగిసిందని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. కమల్‌హాసన్‌ తన పోర్షన్‌ పూర్తి చేశారని మరికొందరు చెబుతున్నారు. నిజం ఏమిటనేదానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే దర్శకుడు శంకర్‌ ఈ ఫొటోలో కనిపించకపోవడం విశేషం. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - Jan 03 , 2024 | 01:26 AM