చిరంజీవి సినిమాలో నటిస్తున్నా
ABN , Publish Date - Aug 31 , 2024 | 06:11 AM
మెగాస్టార్ చిరంజీవితో కలసి సినిమాలో నటించే అవకాశం లభించనుందని కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపుర కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,
చిక్కబళ్లాపుర ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్
బెంగళూరు (ఆంధ్రజ్యోతి) : మెగాస్టార్ చిరంజీవితో కలసి సినిమాలో నటించే అవకాశం లభించనుందని కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపుర కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవికి తాను పెద్ద అభిమానినని అన్నారు. ఆయనకు తనపై ప్రేమ ఉందని అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు హైదరాబాద్‌లోని ఇంటికి పిలిపించి సన్మానం చేశారని అన్నారు. పవన్ కల్యాణ్ గెలిచినప్పుడు తాను ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపానని అన్నారు. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారని, అది ముగిశాక ప్రారంభమయ్యే మరో సినిమాలో తాను నటిస్తానని తెలిపారు. తన పాత్ర ఏమిటనేది భవిష్యత్తులో తెలుస్తుందని అన్నారు.