ఆటకట్టించే ఐపీఎస్‌

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:05 AM

ఆర్కే సాగర్‌ కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ది 100’. రాఘవ్‌ ఓంకార్‌ శశిధర్‌ దర్శకత్వంలో రమేశ్‌ కరుటూరి, వెంకీ పూశడపు,

ఆటకట్టించే ఐపీఎస్‌

ఆర్కే సాగర్‌ కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ది 100’. రాఘవ్‌ ఓంకార్‌ శశిధర్‌ దర్శకత్వంలో రమేశ్‌ కరుటూరి, వెంకీ పూశడపు, జే తారక్‌రామ్‌ నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్రం టీజర్‌ను మెగా మదర్‌ కొణిదెల అంజనాదేవి చేతుల మీదుగా విడుదల చేశారు. నేరస్తుల ఆటకట్టించే ఐపీఎస్‌ అధికారి విక్రాంత్‌గా టీజర్‌లో ఆర్‌కే సాగర్‌ ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో మిషా నారంగ్‌ కథానాయిక. ధన్య బాలకృష్ణ కీలకపాత్ర పోషిస్తున్నారు. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ కే నాయుడు.

Updated Date - Apr 27 , 2024 | 12:06 AM