Gagana Maargan: ‘గగన మార్గన్‌’లో విలన్‌గా చేస్తుంది ఎవరో తెలుసా..

ABN , Publish Date - Nov 23 , 2024 | 09:43 PM

టాలెంటెడ్ యాక్టర్ విజయ్ ఆంటోని సినిమాలు కంటెంట్ ప్రధానంగా ఉంటాయనే విషయం తెలిసిందే. వరుస చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తోన్న విజయ్ ఆంటోని.. ఇప్పుడు ‘గగన మార్గన్’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌తో పోటీ పడే నటుడికి సంబంధించి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ నటుడు ఎవరంటే..

Gagana Maargan Movie Still

‘బిచ్చగాడు’ సినిమాతో తమిళ్‌తో పాటు తెలుగులోనూ గుర్తింపును సొంతం చేసుకున్న హీరో విజయ్ ఆంటోని. ఆ సినిమా తర్వాత ఆయన చేస్తున్న సినిమాలన్నీ తెలుగులోనూ రిలీజ్ అవుతూ వస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ ఆంటోని చేస్తోన్న మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ ‘గగన మార్గన్’. లియో జాన్ పాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా, మీరా విజయ్ ఆంటోని సగర్వంగా సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ మంచి స్పందనను రాబట్టుకోగా.. ఇప్పుడీ సినిమాలో విలన్‌గా చేస్తున్న నటుడి గురించి చర్చలు నడుస్తున్నాయి. ఇంతకీ ఈ సినిమాలో విలన్‌గా చేస్తున్న నటుడు ఎవరంటే..

Also Read- Sreeleela: ‘పుష్ప2’ కిస్సిక్ సాంగ్ ప్రోమో విడుదల వేళ శ్రీలీల ఏం చేస్తుందో చూశారా..

విజయ్ ఆంటోని మేనల్లుడు (సోదరి కొడుకు) అజయ్ ధీషన్‌ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. ఇదే ఆయన పరిచయ చిత్రం కావడం విశేషం. మాములుగా అయితే ఇలాంలి రిలేషన్స్ సంబంధించిన పరిచయం హీరోగా ఉంటుంది. కానీ, అజయ్ ధీషన్‌ను విలన్‌గా పరిచయం చేస్తుండటం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమాలో అజయ్ ధీషన్ లుక్‌ని పరిచయం చేస్తూ తాజాగా మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.


Ajay-Dhishan.jpg

ఈ యాక్షన్-ప్యాక్డ్ పోస్టర్‌ను చూస్తుంటే విజయ్ ఆంటోనీ, అజయ్‌ మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండేలా కనిపిస్తోంది. ఈ రెండు పాత్రలు తలపడే సీన్లు ప్రేక్షకులకు ఆడ్రినలిన్ రష్‌ ఇచ్చేలా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘గగన మార్గన్’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే హృద్యమైన కుటుంబ చిత్రంగా ఉంటుందని.. త్వరలోనే ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు. సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి, అంతగారం నటరాజన్ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి విజయ్ ఆంటోని స్వయంగా సంగీతం సమకూర్చుతున్నారు.

Also Read- KA OTT: ‘క’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్పెషల్ ఏంటంటే..

Also Read-Sharmila: ప్రభాస్‌తో నాకున్న రిలేషన్ ఏంటంటే.. షర్మిల సంచలన వ్యాఖ్యలు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 23 , 2024 | 09:43 PM