సరికొత్త ప్రపంచంలోకి
ABN , Publish Date - Oct 09 , 2024 | 12:54 AM
జీవా, అర్జున్ సర్జా హీరోలుగా పా. విజయ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై డాక్టర్ ఈశారి కె. గణేశ్ నిర్మిస్తున్నారు. ‘అఘతియా’ అనే టైటిల్‌ను మేకర్స్ ...
జీవా, అర్జున్ సర్జా హీరోలుగా పా. విజయ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై డాక్టర్ ఈశారి కె. గణేశ్ నిర్మిస్తున్నారు. ‘అఘతియా’ అనే టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు. చిత్రబృందం మంగళవారం ఫస్ట్‌లుక్‌ను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా పా. విజయ్ మాట్లాడుతూ ‘ఇంతకు ముందెన్నడూ చూడని ప్రపంచంలోకి చేసే అద్భుత ప్రయాణాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. సీజీ విజువల్స్ అలరిస్తాయి’ అని చెప్పారు. రాశీఖన్నా, మటిల్డా కీలకపాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: దీపక్‌కుమార్ పతి