సరికొత్త ప్రపంచంలోకి...

ABN , Publish Date - Sep 25 , 2024 | 01:23 AM

సుధీర్‌బాబు నటిస్తున్న సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ ‘జటాధర’. ఈ పాన్‌ ఇండియా సినిమాను వెంకట్‌కల్యాణ్‌ దర్శకత్వంలో ప్రేరణ్‌ అరోరా, శివివన్‌ నారంగ్‌, నిఖిల్‌ నంద, ఉజ్వల్‌ ఆనంద్‌ నిర్మిస్తున్నారు...

సుధీర్‌బాబు నటిస్తున్న సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ ‘జటాధర’. ఈ పాన్‌ ఇండియా సినిమాను వెంకట్‌కల్యాణ్‌ దర్శకత్వంలో ప్రేరణ్‌ అరోరా, శివివన్‌ నారంగ్‌, నిఖిల్‌ నంద, ఉజ్వల్‌ ఆనంద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి సెకండ్‌ పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా సుధీర్‌బాబు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా మిమ్మల్ని ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. విజువల్‌గా.. ఎమోషనల్‌గా అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌లో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది శివరాత్రికి విడుదలవుతుంది’’ అని చెప్పారు.

Updated Date - Sep 25 , 2024 | 01:23 AM