ఇంటర్మీడియెట్‌ టీనేజ్‌ లవ్‌స్టోరీ

ABN , Publish Date - Jun 20 , 2024 | 02:14 AM

ప్రణవ్‌ ప్రీతమ్‌, షాజ్ఞశ్రీ వేణున్‌ జంటగా నటించిన ‘ప్రభుత్వ జూనియర్‌ కళాశాల’ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఓ యథార్థ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి శ్రీనాథ్‌ పులకురం దర్శకత్వం...

ఇంటర్మీడియెట్‌ టీనేజ్‌ లవ్‌స్టోరీ

ప్రణవ్‌ ప్రీతమ్‌, షాజ్ఞశ్రీ వేణున్‌ జంటగా నటించిన ‘ప్రభుత్వ జూనియర్‌ కళాశాల’ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఓ యథార్థ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి శ్రీనాథ్‌ పులకురం దర్శకత్వం వహించారు. భువన్‌రెడ్డి కొవ్వూరి నిర్మాత. బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో దర్శకుడు మాట్లాడుతూ ‘ఎన్నో ఇబ్బందుల్ని దాటుకొని మా సినిమాను విడుదలకు తీసుకురావడమే పెద్ద విజయంగా భావిస్తున్నాం. ఇంటర్మీడియెట్‌ టీనేజ్‌ లవ్‌స్టోరీ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. కొన్ని నెలల పాటు వర్క్‌ షాప్‌ నిర్వహించి షూటింగ్‌కు వెళ్లాం. ఆర్టిస్టులను మా ఊరు పుంగనూరు తీసుకు వెళ్లి రాయలసీమ యాస నేర్పించాం. సినిమా మీద ప్యాషన్‌తోనే ఇదంతా చేశాం’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘చిత్ర పరిశ్రమలో నాకు ఎవరితోనూ పరిచయాలు లేవు. మా దర్శకుడు శ్రీనాథ్‌కు సినిమా అంటే ఎంతో ప్యాషన్‌, కమిట్‌మెంట్‌ ఉన్నాయి. ఆయన త్వరలోనే పెద్ద సినిమాలు చేస్తాడనే నమ్మకం ఉంది. మేం ఇచ్చిన తక్కువ బడ్జెట్‌లోనే సినిమాను బాగా తీశాడు’ అన్నారు. చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలకు హీరో ప్రణవ్‌ ప్రీతమ్‌, హీరోయిన్‌ షాజ్ఞ కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jun 20 , 2024 | 02:14 AM