ఆసక్తికరమైన కంటెంట్‌

ABN , Publish Date - Oct 25 , 2024 | 02:26 AM

చంద్రశేఖర్‌ రాథోడ్‌ లీడ్‌ రోల్‌ పోషించి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘గ్యాంగ్‌స్టర్‌’. కాశ్వీ కాంచన్‌ హీరోయిన్‌. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా...

చంద్రశేఖర్‌ రాథోడ్‌ లీడ్‌ రోల్‌ పోషించి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘గ్యాంగ్‌స్టర్‌’. కాశ్వీ కాంచన్‌ హీరోయిన్‌. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా చిత్రబృందం ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆకాశ్‌పూరి మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ట్రైలర్‌, కంటెంట్‌ ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే చిత్రమిది’’ అని చెప్పారు. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని దర్శకుడు చంద్రశేఖర్‌ రాథోడ్‌ అన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 02:26 AM