వినూత్నంగా ఆయ్‌

ABN , Publish Date - Mar 05 , 2024 | 02:23 AM

మ్యాడ్‌ మూవీతో కుర్రకారును మెప్పించారు నార్నే నితిన్‌. తాజాగా ఈ నటుడు నయన్‌ సారికతో కలసి ‘ఆయ్‌’ చిత్రంలో నటిస్తున్నారు. అంజి కంచిపల్లి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు..

వినూత్నంగా ఆయ్‌

మ్యాడ్‌ మూవీతో కుర్రకారును మెప్పించారు నార్నే నితిన్‌. తాజాగా ఈ నటుడు నయన్‌ సారికతో కలసి ‘ఆయ్‌’ చిత్రంలో నటిస్తున్నారు. అంజి కంచిపల్లి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌ బన్నీ వాసుతో సంయుక్తంగా విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు. ‘ఆయ్‌’ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. దీంతో చిత్ర యూనిట్‌ ప్రమోషనల్‌ యాక్టివిటీస్‌ను వేగవంతం చేసింది. అందులో భాగంగానే ఈ హిలేరియస్‌ ఎంటర్టైన్‌మెంట్‌ టైటిల్‌ను అనౌన్స్‌ చేశారు. నిర్మాత బన్నీవాస్‌, నార్నే నితిన్‌, నయన్‌ సారిక, డైరెక్టర్‌ అంజిపల్లి మధ్య జరిగే సరదా ఫోన్‌ సంభాషణతో టైటిల్‌ను వినూత్నంగా ప్రకటించారు. సరదా సంభాషణ, ఫన్నీ మీమ్స్‌ రిఫరెన్స్‌లతో సాగే ఈ వీడియో అందరినీ మెప్పిస్తోంది. ఈ వీడియోలో ‘సమ్మర్‌లో కలుద్దాం’ అంటూ హింట్‌ ఇచ్చారు. మార్చి 7న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేస్తామని తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌- సమీర్‌ కల్యాణి, సంగీత దర్శకుడు- రామ్‌ మిర్యాల, ఎడిటర్‌- కోదాటి పవన్‌ కల్యాణ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌- కిరణ్‌ కుమార్‌ మన్నె, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌- అజయ్‌ గద్దె, సహ నిర్మాతలు- భాను ప్రతాప్‌, రియాజ్‌ చౌదరి.

Updated Date - Mar 05 , 2024 | 02:23 AM